‘థౌజండ్ వాలా’పై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కు ల‌వ్వు

Posted November 29, 2016

Image result for rbi on 1000

500,1000 రూపాయ‌ల నోట్ల వ‌ల్లే బ్లాక్ మ‌నీ పెరిగింద‌ని ప్రధాని న‌రేంద్ర‌మోడీ భావ‌న‌. అందుకే ఆ నోట్ల‌ను ర‌ద్దు చేశారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా క‌రెన్సీ క‌ష్టాల‌ను ఆయ‌న ఊహించ‌లేక‌పోయారు. ఆర్భాటంగా 2 వేల నోటును తీసుకొచ్చారు కానీ… దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏమాత్ర‌మైనా లాభ‌ముందా అని అంచ‌నా వేయ‌లేక‌పోయారు. ఏటీఎంల‌లో 2వేల నోటు అందుబాటులో ఉన్నప్ప‌టికీ దాని కోసం జ‌నం తిప్ప‌లు ప‌డుతున్నారు. చివ‌ర‌కు చ‌చ్చీ చెడి 2 వేల నోటును సాధిస్తే దానికి స‌రిప‌డా చిల్ల‌ర ఎక్క‌డా దొర‌క‌డం లేదు. అందుకే కేంద్రంపై విప‌రీత‌మైన విమ‌ర్శ‌లొస్తున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలోనైతే నెటిజ‌న్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ పై వాగ్బాణాలు సంధిస్తున్నారు.

2 వేల నోటు విలువ‌ 1000 రూపాయల నోటు క‌న్నా ఎక్కువ. మ‌రి ఒక్క 2 వేల నోటుతో 500 రూపాయ‌ల సామాన్లు కొంటే మిగ‌తా 1500 చిల్ల‌ర ఎక్క‌డి నుంచి వ‌స్తాయి.. ఇదే ప్ర‌శ్న ఇప్పుడు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ను అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఆయ‌న కూడా వాస్త‌వం గ్ర‌హించార‌ట‌. ఇక 2 వేల నోటు కంటే వెయ్యి రూపాయ‌ల నోటే బెట‌ర‌ని యోచిస్తున్నార‌ట‌. ఆ దిశ‌గా ప్ర‌ధాని మోడీతోనూ చ‌ర్చించార‌ని స‌మాచారం. ఆయ‌న కూడా ఉర్జిత్ స‌ల‌హాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం 2 వేల నోట్లు మార్కెట్లో ఎక్కువ‌య్యాయి. కాబ‌ట్టి కొంత స‌మ‌యం తీసుకొని వెయ్యి రూపాయ‌ల క‌రెన్సీని అందుబాటులోకి తెచ్చే ప్ర‌య‌త్నాల్లో ఆర్బీఐ ఉంద‌ట‌. సో వెయ్యి రూపాయ‌ల నోటు మ‌ళ్లీ మార్కెట్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న మాట‌.