సర్కార్ అనుమతి తీసుకోను యాత్ర కే రెడీ ..ముద్రగడ

Posted December 2, 2016

Image result for mudragada

తాను తల పెట్టబోయే యాత్రకు ప్రభుత్వ అనుమతి తీసుకోనని సత్యాగ్రహ యాత్ర ఆపేదే లేదని మాజీ మంత్రి ముద్ర గడ పద్మనాభం చెప్పారు.కాపు రిజర్వేషన్ సాధన కోసం దశల వారీ గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు . కాపు రిజర్వేషన్ల సాధనకు నాలుగు దశల్లో భవిష్యత్‌ పోరాట కార్యాచరణ ప్రకటించారు. . శుక్రవారం జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.నవంబర్‌ 16 నుంచి 21 వరకు ముద్రగడ ఆధ్వర్యంలోసత్యాగ్రహ పాదయాత్ర చేపట్టాలని భావించినా ప్రభుత్వం అనుమతించకపోవడంతో విరమించుకున్నారు.ముద్రగడ ఈ ప్రకటన తో మరోసారి గోదావరి జిల్లాల లో ఉద్రికత్త పరిస్థితిలు నెలకొనే అవకాశం వుంది.?

==డిసెంబర్‌ 18న నల్ల రిబ్బన్లు కట్టుకుని.. కంచం, గరిటతో నిరసన
== 30న ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామని,
== జనవరి 8న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు
==. జనవరి 25న కాపు సత్యాగ్రహ యాత్ర