రికార్డుల మోత మోగించిన ర‌యీస్ ట్రైల‌ర్

Posted December 11, 2016

recordsto raees trailer
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సినిమా అంటేనే అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండ‌దు. సినిమా విడుద‌లకు ముందు నుంచే హంగామా ఉంటుంది. సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్లు, టీజ‌ర్లు రిలీజైతే షారుఖ్ ఫ్యాన్స్ కు పండుగే. మూవీ రిలీజైనంత ఆనందం క‌నిపిస్తోంది. అందుకే లైకులు కూడా ఆరేంజ్ లో వ‌స్తాయి. ఈసారి షారుఖ్ ర‌యీస్ అనే కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు షారుఖ్.

ర‌యీస్ ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. దానికి వ‌చ్చిన స్పంద‌న మామూలుగా లేదు. లైకుల్లో పాత రికార్డుల‌న్నీ చెరిగిపోవ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం. ర‌యీస్ ట్రైల‌ర్ రిలీజైన 3 గంట‌ల 35 నిమిషాల్లోనే ల‌క్ష లైకులు కొట్టేసింది. త‌ద్వారా త‌క్కువ టైములో ల‌క్ష లైకులు పొందిన తొలి బాలీవుడ్ సినిమా ట్రైల‌ర్ గా కొత్త రికార్డును సాధించింది. గ‌తంలో ధోనీ లైఫ్ స్టోరీ ఆధారంగా నిర్మించిన ఎం.ఎస్ ధోనీ ట్రైల‌ర్ 12 గంట‌ల్లో…. అమీర్ ఖాన్ – దంగ‌ల్ ట్రైల‌ర్ 23 గంట‌ల్లో ల‌క్ష లైకుల‌ను సాధించాయి, ఇక స‌ల్మాన్ న‌టించిన సుల్తాన్ కు ల‌క్ష లైకుల‌ను సాధించ‌డానికి 42 గంట‌లు ప‌ట్టింది.

అంటే ర‌యీస్ ట్రైల‌ర్ ద‌రిదాపుల్లో కూడా ఏ సినిమా ట్రైల‌ర్ లేదు. కేవ‌లం రెండున్న‌ర నిమిషాల నిడివితో ఉన్న ట్రైల‌ర్ కే ఈ రేంజ్ లో స్పంద‌న ఉండ‌డంతో సినిమా యూనిట్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. రాహుల్‌ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కూడా ట్రైల‌ర్ లాగా సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు.