ఆ సాంగ్ తో దశ తిరుగుతుందా..!

Posted November 18, 2016

Regina Special Solo Song For Nakshatramఎస్.ఎం.ఎస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజినా కుర్ర హీరోలకు సరైన జోడి అనిపించుకుంది. స్టార్స్ అవకాశాలు రాకున్నా యువ హీరోలందరితో ఛాన్స్ కొట్టేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం కృష్ణవంశీ డైరక్షన్లో వస్తున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో రెజినాకు ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట కృష్ణవంశీ.

ఇప్పుడంటే ఫాంలో లేడు కాని కృష్ణవంశీ చేతిలో పడితే హీరోయిన్స్ దశ తిరుగుందని అప్పట్లో అంటుండేవారు. ఆ క్రమంలో రెజినా కు తన మార్క్ స్పెషల్ సాంగ్ తో క్రేజ్ ను ఇంకాస్త పెంచాలని చూస్తున్నాడు కృష్ణవంశీ. ఈ సోలో సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఏకంగా 400 మంది డ్యాన్సర్స్ తో ప్లాన్ చేస్తున్నారట. కృష్ణంవంశీ, సందీప్ కిషన్, రెజినా ముగ్గురికి ఈ సినిమా రిజల్ట్ తోనే తమ తర్వాత సినిమాలు ఆధారపడి ఉన్నాయి.

రెజినా మాత్రం ఈ సినిమా తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ నటిస్తుంది కాబట్టి స్టార్స్ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో అయితే రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నా అవేవి ఫైనల్ కాలేదు.