ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎలా రాగలను : రెజీనా

0
142

 Posted May 20, 2017 at 13:13

rejina talking to movie producer
తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన రెజీనా పలువురు మెగా హీరోలతో సినిమాలు చేసి మెగా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పేరుకు మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేసినా మెగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నా ఈమెకు టాలీవుడ్‌లో అంతగా కలిసి రాలేదు. ఒకటి రెండు మినహా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈమెతో పాటే ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ హీరోయిన్‌ అవ్వగా ఈమెకు మాత్రం ఛాన్స్‌ు రావడమే గగనం అయ్యాయి. దాంతో తమిళంలో ఈమె ప్రయత్నాలు ప్రారంభించింది. తమిళంలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.

తమిళంలో ప్రస్తుతం రెజీనా నాలుగు సినిమాల్లో నటిస్తుండగా, మరో రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ప్రస్తుతం యమ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో విడుదల కాబోతున్న ఒక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మూడు రోజులు పాల్గొనాలని నిర్మాత ఎంతగా రిక్వెస్ట్‌ చేసినా కూడా వినిపించుకోవడం లేదట. ముందుగా అనుకున్న డేట్లలో కాకుండా, ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటే ఎలా వచ్చేది అంటూ ఆ నిర్మాతకు కాస్త ఘాటుగానే ఈ అమ్మడు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఇతర సినిమాల షూటింగ్స్‌తో చాలా బిజీగా ఉన్నాను, ఆ సినిమాల షూటింగ్స్‌ను వదిలేసి రాలేను, వీలున్నప్పుడు తప్పకుండా వచ్చేదాన్ని అని, కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందంటూ ఈ అమ్మడు నిర్మాతకు చెప్పడంతో ఆయన కాస్త ఆగ్రహంగా ఉన్నాడట. హీరోయన్‌ లేకుండానే ఆ తమిళ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేసేస్తున్నారు.