IAS ల పెళ్ళికి మతం అడ్డుగోడ…

0
51

Posted November 30, 2016

Image result for tina dabi marriage

సివిల్స్ 2015 టాప్‌ ర్యాంకర్‌ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్‌ అతహార్‌ ఆమిర్‌ ఉల్‌ షపీ ఖాన్‌ల ప్రేమ వివాహానికి ఒప్పుకొనే ముందు పెళ్ళికొడుకు మతాన్ని మార్చాలని ఆఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్‌ శర్మ ఓ లేఖ రాశారు. ఈ షరతుకి ఒప్పుకొంటేనే వివాహానికి అంగీకరించాలని టీనా తల్లి తండ్రులను కోరారు.

‘మీ కుటుంబం తీసుకున్న నిర్ణయం లవ్‌ జిహాద్‌ను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక వేళ వారిద్దరికి నిజంగా పెళ్లి చేసుకోవాలని బలంగా ఉంటే మాత్రం ఖాన్‌ను హిందూ మతంలోకి ఖచ్చితంగా మారాలి. మార్పిడి తర్వాతే వివాహం జరగాలి. ఈ కార్యక్రమానికి మా సంస్థ సభ్యులు మీకు సహాయం చేస్తారు’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖ సారాంశం ఇలా వుంది.

‘ ప్రియమైన జశ్వంత్‌ దాబిగారు.. 2015 ఐఏఎస్ పరీక్షల్లో టాపర్‌ టీనా నిలవడాన్ని చూసి మేమంతా సంతోషిస్తున్నాం. ఖాన్ను పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించిన నిర్ణయం మమ్మల్ని దిగ్బాంతికి గురి చేసింది. ఈ విషయంలో మేం చాలా విచారంగా ఉన్నాం. మీకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముస్లింలు అంతా లవ్‌ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో ముస్లిం మతంలోకి మార్చేందుకు వివాహం చేసుకుంటున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకోవడమే ఆ ఇద్దిరికి ముఖ్యం అనిపిస్తే ముందు ఖాన్‌ను మతమార్పిడి జరగాలి’ అని కూడా ఆయన అన్నారు.