రెమో మూవీ ప్రివ్యూ …

Posted November 24, 2016

remo movie previewచిత్రం : రెమో (2016)
నటీనటులు : శివ కార్తికేయన్, కీర్తి సురేష్
దర్శకత్వం : బక్కియరాజ్ కన్నన్
సంగీతం : అనిరుధ్
నిర్మాత : దిల్ రాజు

బ‌క్కియరాజ్‌ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శివ‌కార్తికేయ‌న్‌,కీర్తి సురేష్ జంట‌గా తెరకెక్కిన తమిళ్ చిత్రం ‘రెమో’.ఇప్పటికే తమిళ్ లో రిలీజై బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది. అక్కడ ఏకంగా  65-70 కోట్లు కలెక్ట్ చేసింది.ఇప్పుడీ చిత్రం ‘రెమో’టైటిల్ లో తెలుగులోనూ సందడి చేయడానికి రెడీ అయ్యింది.తెలుగులో ఈ చిత్రాన్ని 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.రేపు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ‘రెమో’ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

సింపుల్ గా రెమో ‘కథ’ ఇది :
చిన్నప్పటి నుంచీ హీరో అవ్వాలనుకునే కుర్రోడు ఎస్‌కె (శివ కార్తికేయన్).కావ్య (కీర్తి సురేష్)ని చూసిన వెంటనే కావ్య ప్రేమలో పడిపోతాడు ఎస్‌కె.సినిమా ప్రయత్నాలు ఓ వైపు, కావ్యకి తెలియకుండా ఆమె చుట్టూ తిరిగడం మరోవైపు. ఈ రెండే ఎస్ కె పనులు. అయితే, సినిమాలో వేషం కోసం నర్స్ గెటప్‌తో బస్ ఎక్కిన ఎస్‌కెను అమ్మాయనుకొని కావ్య తనను పరిచయం చేసుకుంటుంది. బాగా మాట్లాడుతుంది. అంతేకాదు.. తను పని చేసే హాస్పిటల్‌లో నర్స్ గా ఎస్‌కెకు జాబ్ కూడా ఇప్పిస్తుంది. కావ్య ప్రేమను దక్కించుకోవడం కోసం ఎస్‌కె తన పేరు రెమోగా మార్చుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరిగింది..? అనేది మిగితా కథ.

తెలుగు ‘రెమో’ ఎలా ఉండబోతున్నాడు :
“ఒక అమ్మాయిని ప్రేమించడం..తన ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే ప్రయత్నం” ఇదే ‘రెమో’ కాన్సెప్ట్. అయితే, దర్శకుడు బ‌క్కియరాజ్‌ క‌న్న‌న్ ట్రీట్ మెంట్ మాత్రం కొత్తగా ఉంటుందట.హీరో,హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతుందట.ఇంటర్వల్ బ్యాంగ్, శివకార్తీకేయన్ నటన, సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్ గా నిలుశాయని చెబుతున్నారు.

ఎక్స్ పెక్టేషన్స్ ఎలా ఉన్నాయ్ :
రెమో.. ఇప్పటికే కోలీవుడ్ జనాలకి పిచ్చి పిచ్చి గా నచ్చేశాడు. తెలుగు ‘రెమో’ని తీసుకొస్తోంది దిల్ రాజు కావడంతో..ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అటు ఇటుగా స్ట్రయిట్ తెలుగు సినిమాకి ఉండే క్రేజ్ ‘రెమో’కి నెలకొంది. పైగా,’నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్..ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమా ఆఫర్స్ కొట్టేస్తూ..హాట్ టాపిక్ గా మారింది.ఇలాంటి టైమ్ లో రెమో వస్తుండటం కలిసొచ్చే అంశం.ఇక్కడ కూడా రెమో మేజిక్ వర్కవుట్ అయితే ..కలెక్షన్స్ ఆఫ్ సెంచరీ దాటడం..దిల్ రాజు పంటపండతం ఖాయం.

ఈ సినిమా లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి..మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.