రెమో మూవీ రివ్యూ…

Posted November 25, 2016

remo movie reviewచిత్రం : రెమో (2016)
నటీనటులు : శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్, శరణ్య
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : బ‌క్కియరాజ్ క‌న్న‌న్
నిర్మాత: దిల్‌రాజు
రిలీజ్ డేట్ : 25 నవంబర్, 2016.

బ‌క్కియరాజ్‌ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శివ‌కార్తికేయ‌న్‌,కీర్తి సురేష్ జంట‌గా తెరకెక్కిన తమిళ్ చిత్రం ‘రెమో’.ఇప్పటికే తమిళ్ లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గానిలిచింది. అక్కడ ఏకంగా  65-70 కోట్లు కలెక్ట్ చేసింది.ఇప్పుడీ చిత్రం ‘రెమో’టైటిల్ లో తెలుగులోనూ సందడి చేయడానికి రెడీ అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘రెమో’ ఈరోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రెమో తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు. రెమో అసలు కథేంటీ.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి
వెళదాం పదండీ..

కథ :
శివ (శివకార్తికేయన్‌)కి సినిమా పిచ్చోడు. సినిమా స్టార్‌ కావాలని కలలుకంటుంటాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. కావ్య (కీర్తి సురేష్‌)ని చూసి ఇష్టపడతాడు. ఆమెకు తెలియకుండా..ఆమె వెంటే తిరిగుతుంటాడు.తన ప్రేమ విషయం చెప్పేలోగా..ఆమెకి నిశ్చితార్థం అయ్యిందనే న్యూస్ తెలుస్తుంది.సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఓసారి అనుకోకుండా నర్సు వేషం వేయాల్సివస్తుంది. ఆ అవతారంలోనే కావ్యని రెమోగా పరిచయం చేసుకొంటాడు. అదెలా అనేది తెరపై చూడాలి. రెమోతో కావ్యకి చనువు పెరుగుతుంది.ఆ చనువుతోనే తన ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది. కావ్యకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో రెమో వేషాన్ని కంటిన్యూ చేస్తుంటాడు శివ. రెమోగా శివ చేసిన అల్లరి ఎంటీ.. ? కావ్య శివకి దక్కిందా.. ?? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* శివకార్తికేయన్‌
* కామెడీ
* పాటలు
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
కేవలం వినోదాన్ని నమ్ముకొని ఫక్తు కమర్షియల్‌ సూత్రాలతో అల్లిన కథ రెమో.రొటీన్ కమర్షియల్ చిత్రమే.. కానీ, దర్శకుడు బ‌క్కియరాజ్ క‌న్న‌న్ ట్రీట్ మెంట్ కొత్తగా ఉంది.వినోదం ప్రేక్షకులకు కాలక్షేపాన్ని అందిస్తాయి.తన ప్రేమని సంపాదించడానికి కథానాయకుడు చేసే ప్రయత్నాలు గమ్మత్తుగా,ఆసక్తికరంగా ఉంటాయి .ఇంటర్ బ్యాంగ్ అదిరిపోయింది. శివ, రెమో రెండు పాత్రల్లో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. రెమో పాత్రలో ఉన్నంత సేపు బాగా నవ్వించేస్తాడు. ‘నేను శైలజ’ సీరియస్ లుక్స్ తో కనిపించిన కీర్తిసురేష్..ఇందులో ఫటా ఫటా మాట్లాడుతూ ఆకట్టుకొంది. మిగిలిన నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :
దర్శకుడు బక్కియరాజ్‌ కన్నన్‌ కు ఇది మొదటి సినిమా. అయినా.. కామెడీ సన్నివేశాలని పక్కాగా రాసుకొన్నాడు. అంతే పక్కాగా తెరకెక్కించాడు కూడా.హీరో-హీరోయిన్ మధ్య నడిచే సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకొంటాయి. ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ సూపర్భ్. కెమెరా పనితనం సినిమా రేంజ్ ని పెంచేసింది. అనిరుధ్ అందించిన పాటులు, నేపథ్యం సంగీతం రెండు బాగున్నాయి.అయితే, ఫస్టాఫ్ లో కామెడీతో అదరగొట్టిన దర్శకుడు..సెకాంఢాఫ్ లో కాస్త తడపడ్డాడు. మళ్లీ క్లైమాక్స్ లో సినిమాని లేపేశాడు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
వినోదమే ప్రధానం.. అని భావించే ప్రేక్షకులకి రెమో బెస్ట్ ఆప్షన్.కాకపోతే.. అందరు తమిళ్ నటులు, మధురై యాస తెలుగు డబ్బింగ్ కరెంట్ గా కుదరకపోవడం తెలుగు ప్రేక్షకులని కాస్త ఇబ్బంది పెట్టే విషయం.మొత్తానికి.. తెలుగు రెమో బాగానే ఎంటర్ టైన్ చేశాడు.

బాటమ్ లైన్ : రెమో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్
రేటింగ్ : 3/5