ఒక్క కట్ లేదంటే గ్రేటే..!

RGV Vangaveeti Movie Has No Cuts In Censor Scrutiny

సంచలన దర్శకుడు రాం గోపా వర్మ తీస్తున్న వంగవీటి సినిమా మొదలు పెట్టిన రోజు నుండి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అని వర్మ కూడా వస్తున్న న్యూస్ అంతటిని ఎంకరేజ్ చేశాడు. ఇక ఆడియో రిలీజ్ నాడు వంగవీటి రాధతో వర్మ మీటింగ్ ఆ తర్వాత గ్రాండ్ గా ఆడియో జరగడం ఇదంతా సినిమా మీద ఊహించని క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నెల 23న వంగవీటి సినిమా రిలీజ్ చేస్తున్న వరమ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుందట.

అనుకున్నట్టుగానే ‘A’ సర్టిఫికెట్ రాగా సినిమాలో కేవలం ఏవో రెండు మూడు కత్తెరలు తప్ప సెన్సార్ వారికి పెద్దగా పని చెప్పలేదట. తీసింది ఓ రౌడియిజం మీద జరిగిన యధార్ధ గాథ మరి అలాంటిది ఎన్ని కత్తెరలు వేస్తారో అన్న ఆలోచనలో ఉన్న ప్రేక్షకులకు కేవలం ఒకటి రెండు కట్ ల తోనే సినిమా వస్తుంది అని తెలియగానే షాక్ అవుతున్నారు. వర్మ బాగా కాన్సెంట్రేట్ చేసి చేసిన సినిమా వంగవీటి. కేవలం సినిమాలో రెండు కుటుంబాల మధ్య విభేదాలని కాకుండా.. రెండు కులాల మధ్య జరిగిన కథ అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అలానే తీర్చిదిద్దాడట. సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వంగవీటి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.