రోగ్‌ రివ్యూ..!

 Posted March 31, 2017

rogue movie reviewచిత్రం: రోగ్‌

తారాగణం: ఇషాన్‌, మన్నారా చోప్రా, ఏంజెలా, పోసాని కృష్ణమురళి, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌, అలీ

ఛాయాగ్రహణం: ముఖేష్‌ 
సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 

ఛాయాగ్రహణం: జి .ముఖేష్‌

నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి 

సంస్ధ: త‌న్వి ఫిలింస్‌

దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

విడుదల తేదీ: 31-03-2017

పూరీ జగన్నాద్.. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడిగా మంచి పేరుని సంపాదించుకున్నాడు. పూరీ సినిమాలు అంటే  తెలుగు ప్రేక్షకులకు కొత్త హీరోయిన్లు పరిచయం అయినట్లే. అటువంటి పూరీ ఒక్కోసారి కొత్త హీరోలను కూడా పరిచయం చేస్తుంటాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో రవితేజ్ ని సోలో హీరోగా, 143 సినిమాతో సాయి రామ్ శంకర్ ని పరిచయం చేశాడు. తాజాగా రోగ్ సినిమా ద్వారా ఇషాన్ అనే యంగ్ స్టర్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు పూరీ. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మరి వరుస ఫ్లాఫ్ లతో సతమతమవతున్న పూరీని ఈ రోగ్ ఎంతవరకు రక్షించాడో తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.  

కధ ఏంటంటే:

ఈ సినిమాలో ఇషాన్‌.. చంటిగా, ఏంజెలా..అంజలిగా, సుబ్బరాజు ..ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ గా, అనూప్‌సింగ్‌.. సైకోగా నటించారు. మన్నారా కూడా .. అంజలిగానే నటించింది.

ప్రేమకోసం ప్రాణమిచ్చే చంటి.. కమీషనర్ చెల్లెలు అంజలి( ఏంజెలా)ని ప్రేమిస్తాడు. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పించడంతో అంజలి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లికి వెళ్లిన చంటి అక్కడ జరిగిన గొడవలో ఓ కానిస్టేబుల్ ని గట్టిగా కొట్టడంతో అతనికి రెండు కాళ్లూ పోతాయి. దీంతో చంటి జైలు పాలవుతాడు. అలానే ఆ కానిస్టేబుల్ కుటుంబం రోడ్డున పడుతుంది. జైలు నుండి వచ్చిన చంటి తన వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకుని ఆ కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకోసం వారి ఎదురింటిలోనే ఉంటూ ఆటో డ్రైవర్ గా, రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ వారి అప్పులను తీరుస్తుంటాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు అంజలి ముందర చంటిని ద్వేషించినా, ఆ తర్వాత  చంటి చేసిన సాయానికి అతనితో ప్రేమలో పడుతుంది. తనను మోసం చేసిన అమ్మాయి పేరు కూడా అంజలినే కావండతో చంటి  ఈ అంజలినీ కాస్త దూరం పెట్టినా తర్వాత ఆమె ప్రేమలో పడతాడు. మరోవైపు  జైలు నుండి తప్పించుకొచ్చిన సైకో అంజలిని పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపేయాలనుకుంటాడు. సైకో నుండి అంజలిని చంటి ఎలా కాపాడాడు.. అన్నదే రోగ్ సినిమా కధ.

కధనం ఏంటంటే:

మరో చంటిగాడి ప్రేమకధ అని క్యాప్షన్ పెట్టినా ఇందులో మాస్ ఎలిమెంట్సే  ఎక్కువగానే ఉన్నాయి. జైల్లో ఉన్న చంటి తన ప్రేమకథను చెప్పడంతో సినిమా ఆరంభమవుతుంది. కమిషనర్‌ కూతురిని ప్రేమించడం, ఆ అమ్మాయికి పెళ్లవ్వడం  తట్టుకోలేని చంటి అక్కడికి వెళ్లి గొడవ చేయటం, ఆ తర్వాత జైలు జీవితం.. ఇలా ఫస్టాఫ్ సాగిపోతుంది. జైలు నుంచి బయటకు వచ్చాకే కథలో ట్విట్స్ లు మొదలవుతాయి. సైకో పాత్రతో సెంకడాఫ్ మీద ఇంట్రస్ట్ వచ్చినా తర్వాత ఏం జరుగుతుందో ఆడియన్స్ ఈజీగా  గెస్ చేసేస్తారు. ఫస్టాఫ్ పర్లేదనుకున్నా సెకండాఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే:

ఇషాన్ మొదటి సినిమాతోనే  మాస్ హీరోగా నిలబడగలిగాడు. మన్నారా తన రోల్ తో ఆకట్టుకోగా ఏంజెలా  గ్లామ‌ర్ షోకి మాత్రమే పరిమితం అయ్యింది. సైకో పాత్రలో అనూప్‌సింగ్‌ సరిగ్గా సెట్ అయ్యాడు. పూరి మార్క్ డైలాగ్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఇషాన్ ని  మాస్ హీరోగా ఎలివేట్ చేయడంతో సక్సెస్ సాధించాడు. టెక్నికల్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

హీరో, విలన్ ల నటన

పూరీ డైలాగ్స్

ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్

రొటీన్ కధ,కధనం

ఆఖరి పంచ్: రోగ్ ప్రేమ  చాలా రొటీన్

Telugu Bullet Rating : 2.25/5