పుస్తకంగా రోహిత్ అంతరంగ మథనం..

0
219

 rohith self book

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న స్కాలర్ రోహిత్ వేముల వివిధాంశాలపై ఎలాంటి అభిప్రాయాలతో ఉండేవాడు.. అతని మస్తిష్కంలో ఎలాంటి భావనలుండేవి.. వీటిపై ఇపుడు ఓ పుస్తకం వచ్చింది.. “కేస్ట్ ఈజ్ నాట్ ఏ రూమర్ ..ది ఆన్ లైన్ డైరీ ఆఫ్ రోహిత్ వేముల” అనే ఈ పుస్తకం అతని అంతరంగ ఆవిష్కరణగా చెప్పొచ్చు.

ప్రస్తుతం హిందూ దినపత్రికలో పనిచేస్తున్న నిఖిలా హెన్రీ రోహిత్ ఫేస్ బుక్ పోస్టులన్నింటినీ తీసి ఆయన అభిప్రాయాలకు ఒక నిర్దిష్ట రూపం ఇచ్చారు. 2008 నుంచి 2016 దాకా రోహిత్ అంతరంగ మథనం ఈ పుస్తకం. నిరుడు ఫిబ్రవరిలో నిఖిల ఆయనను కలిసింది.. ఆయనకు ఆన్ లైన్ లో స్నేహితురాలిగా చాలా ఇష్యూస్ ను షేర్ చేసుకునేది. సామాజిక న్యాయం, దేశంలో వర్ణ వ్యవస్థ, వర్గ పోరాటాలు.. ఇవన్నీ రోహిత్ ఎఫ్ బి లో ఉన్నాయి. వాటిని తీసి పుస్తకంగా వేసింది నిఖిల.