రోజా కామెడీ పాలిటిక్స్..

Posted November 15, 2016

roja comedy political comments on 500 1000 rs notes bannedరాజకీయాలు,రాజకీయనేతల తీరు చూశాక నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు.అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజా కామెంట్స్ వినితీరాల్సిందే.మోడీ నిర్ణయం గురించి తీవ్ర విమర్శలు గుప్పించిన ఆమె నోట్ల రద్దు వ్యవహారం బాబుకి ముందే తెలుసని ఆరోపించారు.బాబు ముందుగానే నల్ల డబ్బుని తెల్లడబ్బుగా మార్చుకుని నోట్లరద్దు గురించి పోరాడారని ఆమె ఆరోపించారు.అంతవరకు ఆమె చెప్పినదాంట్లో నిజానిజాల్ని పక్కనబెడితే జగన్ గురించి ప్రస్తావన రాగానే పాపం అయన దగ్గర ఎలాంటి నల్లధనం లేదన్నారు.అబ్బబ్బా ఏమి చెప్పారు రోజాగారు అనుకోవడం అక్కడున్న జర్నలిస్టుల వంతే కాదు చూసే జనానిది కూడా.జబర్దస్త్ కి అలవాటుపడ్డ జనం ఇక్కడ కూడా రోజా కామెడీ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకొంటున్నారు.