జగన్ పై రోజా అసంతృప్తి!!

Posted February 13, 2017

roja disappointed for jagan not responding
మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవహారం బాగానే సీరియస్ అయ్యింది. డీజీపీకి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. వైసీపీ నాయకులు కూడా ఆమె తరపున గట్టిగానే మాట్లాడారు. కానీ జగన్ మాత్రం చాలా లేటుగా స్పందించారు.

వైసీపీ అధినేతగా ఉన్న జగన్ తరపున రోజా ఎంతో పోరాడుతున్నారు. జగన్ అండ చూసుకొని చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కానీ జగన్ మాత్రం ఆమెను లైట్ తీసుకుంటున్నారు. రోజా అరెస్ట్ పై పెద్ద రచ్చ జరిగినా.. ఆయన మాత్రం స్పందించలేదు. ఆ క్షణంలోనే ఆయన స్పందించి ఉండే పరిస్థితి వేరే రకంగా ఉండేది. జగన్ రియాక్ట్ అవుతారని రోజా కూడా భావించారట. కానీ ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. పార్టీలో ముఖ్య నాయకురాలిగా ఉన్న ఆమె విషయంలోనూ వైసీపీ చీఫ్ రియాక్ట్ కాకపోవడంపై … ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. చివరకు ఈ వ్యాఖ్యలు జగన్ వరకు వెళ్లాయి. దీంతో ఆయన మరోదారి లేక ఆలస్యంగా స్పందించారట. ఏదో మొహమాటం కోసం నాలుగు మాటలు మాట్లాడారు.

అసలే లేటుగా స్పందించారంటే.. అది కూడా మొక్కుబడిగా మాట్లాడ్డంపై రోజా ఆగ్రహంగా ఉన్నారట. పార్టీ కోసం ఇంత కష్టపడితే… తన విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఇక దూకుడు తగ్గిదామనుకొని డిసైడయ్యారట. వైసీపీ శ్రేణులు కూడా రోజా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారని టాక్.