బాహుబలి వల్ల కానిది రుద్రమదేవి చేసి చూపింది..

0
300

   rudrama devi court nominated oscar awards bahubali no nominated oscar
బాహుబలి భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రచారం లభించిన చిత్రం.విజయం కూడా అదే స్థాయిలో దక్కింది.అయితే సినీజీవుల శిఖరాగ్ర లక్ష్యమైన ఆస్కార్ విషయంలో మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.విదేశీవిభాగంలోఆస్కార్ నామినేషన్ కోసం భారత్ నుంచి వెళ్లే అర్హత సాధించలేకపోయింది.జ్యూరీ సభ్యులు బాహుబలిని పక్కనపెట్టి మరాఠి చిత్రం కోర్ట్ వైపు మొగ్గుచూపారు.

దర్శకదిగ్గజం రాజమౌళి వల్లకాని ఆ పనిని గుణశేఖర్ చేయగలిగాడు.ఆయన సర్వశక్తులూ ఒడ్డి నిర్మాత,దర్శకుడిగా తీసిన రుద్రమదేవి విదేశీచిత్రాల విభాగంలో భారత్ తరుపున ఆస్కార్ కమిటీ ముందుకెళ్లనుంది.ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై గుణశేఖర్ ఆనందానికి  అవధుల్లేవు.ఎంతో కస్టపడి తీసిన సినిమా ఒక మోస్తరు విజయాన్నే సాధించింది.ఆ అసంతృప్తి ఈ వార్తతో ఎగిరిపోయివుంటుంది.ఔను సృజనాత్మక వ్యక్తులు,శక్తులు కోరుకునేది పనికి తగ్గ గుర్తింపే కదా