ట్విట్టర్ లో సచిన్ “నివాళి”…

Posted November 28, 2016


సచిన్ టెండూల్కర్ పేరు తెలియని వారుండరు, అలాగే అభిమానులు 5 ఏళ్ల వయసు నుంచి 93 ఏళ్ల వృద్దులు ఉన్నారు. సచిన్‌ అభిమానుల్లో ఒకరైన మేరీ సెరావో (93) శనివారం మృతి చెందారు. ట్విట్టర్‌ ద్వారా ఆమెకు నివాళి అర్పించాడు మాస్టర్ బ్లాస్టర్ .

Image result for sachin oldest fan Mary Serrao has passed Away

మేరీ సెరావోకు సచిన్‌ అంటే విపరీతమైన ఇష్టం.2009లో ఓ షూటింగ్‌ సమయంలో ఆమెకు సచిన్ ను కలసుకునే అవకాశం వచ్చింది. అత్యంత పెద్ద వయస్కురాలైన ఆమెను సచిన్‌ సగౌరవంగా ఆహ్వానించి కొంత సమయం గడిపాడు. సచిన్‌పై ఇష్టంతో వయసును లెక్కచేయక 2013లో వెస్టిండీస్‌తో ఆడిన చివరి అంతర్జాతీయ టెస్టు (200)ను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. యాదృచ్ఛికంగా సచిన్‌, మేరీ ఏప్రిల్‌ 24న జన్మించడం విశేషం.ఆమె మరణ వార్త విన్న సచిన్ ట్విట్టర్ లోఆమె కి నివాళులు అర్పించారు .

sachin tendulkar Retweeted OMGSACHIN

Remember going to her place to spend time with her. I know her blessings will always be with me but will miss her … RIP