సాయిధరమ్, మంచుమనోజ్ లతో “బిల్లా రంగా” రీమేక్

Posted February 3, 2017

sai dharam tej manchu manoj billa ranga movie remakeదాదాపు  35 యేళ్ళ క్రితం వచ్చిన “బిల్లా రంగా” అప్పట్లో సూపర్ హిట్ ను సాధించింది.  మోహన్ బాబు, చిరంజీవిలకు లైఫ్ ఇచ్చిన ఈ సినిమా రీమేక్ రూపంలో మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.  

రీమేక్ బిల్లా రంగాలో సాయి ధరమ్, మంచు మనోజ్ లు నటించనున్నారని సమాచారం. మనోజ్ నటించిన తాజా చిత్రం ‘గుంటూరోడు’ ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన సాయిధరమ్ ‘బిల్లా రంగా’ రీమేక్ గురించి ప్రస్తావించడంతో  మనోజ్ కూడా ఓకే చెప్పాడట. దీంతో ఆ కథను డీల్ చేసే దర్శకుడి కోసం వేట మొదలుపెట్టారట ఈ యంగ్ హీరోలు. కధను ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు కాస్త మాడిఫై చేసి చిరు రోల్లో సాయి ధరమ్, మోహన్ బాబు రోల్లో మనోజ్ నటించే ప్లాన్ లో ఉన్నారట. చిరు, మోహన్ బాబుల కెరీర్ కి ప్లస్ అయిన ఈ సినిమా సాయి ధరమ్, మనోజ్ ల కెరీర్ కి ఎటువంటి హిట్ ను అందివ్వనుందో చూడాలి.