బాబుకి కుర్ర హీరోల షాక్..

Posted January 24, 2017


ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రత్యేక హోదా అంశం పెద్ద చిక్కే తెచ్చేట్టు వుంది.ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప టాలీవుడ్ బడా హీరోలంతా మౌనంగా ఉంటే కుర్ర హీరోలు మాత్రం యువతరం విశాఖపట్నం లో తలపెట్టిన మౌన నిరసనకు అండగా నిలుస్తున్నారు.ఈ జాబితాలో ఎప్పుడూ ఊహించని పేర్లు కనిపిస్తున్నాయి.పవన్ కి అండగా మెగా క్యాంపు హీరోలు ముందుగా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్,చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్,చోటా కె.నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ విశాఖ ఉద్యమానికి అండగా గళం ఎత్తారు.సందీప్ కిషన్ నేరుగా ఆ రోజు మౌన ప్రదర్శనలో పాల్గొనున్నట్టు చెప్పారు.దీంతో పరిస్థితి వేడెక్కుతున్నట్టు బాబు సర్కార్ కి అర్ధమైంది.కుర్ర హీరోల దూకుడు బాబుకి షాక్ ఇచ్చింది.

అటు విశాఖ సభ జరగకుండా చూసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.ఆ ఆరోపణల్లో నిజం ఉందో..లేదో గానీ ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన తాజా ప్రకటన ఆ ఆరోపణలకు ఊతమిస్తోంది.సోషల్ మీడియా ప్రకటనలని ఆధారం చేసుకుని నిర్వహించే కార్యక్రమాలని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.ఇది ముద్రగడ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారని అనుకుంటున్నా అసలు టార్గెట్ విశాఖ మౌన నిరసన అని తెలుస్తోంది.అయితే ఇందాకా వచ్చాక ఆ నిరసనని అడ్డుకుంటే ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని కూడా సర్కార్ భయపడుతోంది.ఏదేమైనా కుర్ర హీరోలు మౌనం వీడి మౌన నిరసనకు మద్దతు పలకడం బాబు ఊహించని పరిణామం.దీన్ని ఆయన ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.
sai dharam tej support to ap special status

varun tej support to ap special status

sandeep kishan participated for ap special status