సాక్షిని ఆక్రమిస్తోందెవరు ?

  sakshi  paper support jagan undavalli
సాక్షి …ఈ పత్రిక పుట్టుక,ప్రస్తానం ఓ సంచలనం.పత్రికా రంగం నుంచి కాంగ్రెస్ కి ,వైస్ కి మద్దతు కోసం ఏర్పడిన సాక్షి దారిలో ఎన్నో మలుపులు ..మరెన్నో మైలురాళ్ళు.సాక్షిలో ఏమి వస్తుందన్నది పక్కన పెడితే ఈనాడు ని ఢీకొన్న పత్రికల్లో సాక్షి అంత సర్క్యూలేషన్ సాధించిన పేపర్లు లేనేలేవు.కానీ సాక్షి పత్రిక మీదున్న ప్రధాన అభ్యంతరం అది జగన్ బాకా ,చంద్రబాబు వ్యతిరేకత మీదే నడుస్తుందని.ఒకప్పుడు ఈనాడు,ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్ కి కౌంటర్ వ్యాసాలు రాసేవాళ్ళు.ఆ తరువాత ఆ పద్ధతి కూడా పక్కకెళ్లింది.ఓన్లీ టార్గెట్ చంద్రబాబు..లేదా జగన్ అనుకూల వార్తలు .

సాక్షి ప్రధానపత్రిక నిండా జగన్,బాబు కనిపించేవాళ్ళు.గడిచిన వారంరోజులుగా చూస్తుంటే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.ఒకప్పుడు వైస్ ఆప్తుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బాబు సర్కార్ మీద ఎడాపెడా ఆరోపణలతో సాక్షిని ఆక్రమించేస్తున్నారు.అప్పట్లో జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినపుడు అనధికారికంగా సాక్షి వుండవల్లిని బ్యాన్ చేసింది.ఇప్పుడే అదే పత్రిక ఆయన్ను భుజాన మోస్తోంది.అదే అరుణ్ కుమార్ ఒకప్పుడు సీఎం పదవికి జగన్ సమర్ధతపై అటుఇటుగా మాట్లాడారు.ఇప్పుడేమో జగన్ సీఎం అయితే సంతోషమేగా అంటున్నారు.ఏదైనా రాజకీయం బహు చిత్రమబ్బా ..