సాక్షి ,సింధు ఇక ఖేల్ రత్నలు…

  sakshi pv sindhu got khel rathna awardsరియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీ.వి.సింధు, కాంస్య పత విజేత సుల్తాన్ సాక్షి మాలిక్‌కు కేంద్ర ప్రభుత్వం అపూర్వ గౌరవాన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నగదు పురస్కారా లతో తమ ప్రోత్సాహాన్ని వ్యక్తం చేస్తుండగా… కేంద్ర ప్రభుత్వం మరింత ఉన్నత స్థాయి గౌరవాన్ని ఇచ్చింది. రియోలో అసలు దేశానికి ఒక్క పతకమైనా వస్తుందా.. లేదా అనే సందిగ్దంలో ఉన్న క్రమంలో ఒకేరోజు రెండు పతకాలు సాధించి జాతి గౌరవాన్ని కాపాడిన సింధు, సాక్షిలకు అత్యుత్తమ క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’తో సత్కరించనున్నట్లు తెలిపింది.

ఈ అవార్డును ఈ నెల 2౯న రాష్ట్రపతి చేతుల మీదుగా సింధు, సాక్షి అందుకో నున్నారు. కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం వల్ల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు దేశ అత్యుత్నత క్రీడా పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించా రు. జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతు రాయ్‌ల పేర్లను కూడా ఖేల్‌రత్న అవార్డుకు పరిశీలిస్తున్న ట్లు సమాచారం.