సల్మాన్ ‘ఇజం’ చూపించబోతున్నాడా.. ?

 Posted October 26, 2016

salman khan remake ism movie in bollywoodపూరీ జగన్నాథ్-కళ్యాణ్ రామ్ కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం “ఇజం”.ఇందులో జర్నలిజాన్ని హైలైట్ చేసి చూపించాడు పూరి. గతవారం (అక్టోబర్ 21) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇజం’ ఇరగదీస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబోడుతోంది. కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా హీరో నటన ఫుల్ స్కోప్ ఉంది. ఇప్పుడిదే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి తెగ నచ్చేసింది.

‘ఇజం’ హిందీలో రిమేక్ చేసేందుకు సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారమ్.దర్శకుడు పూరీ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడట. సల్మాన్ ఫైనల్ డిసిషన్ చెబితే.. ‘ఇజం’ని బాలీవుడ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు-చేర్పులు చేసి.. సల్మాన్ ‘ఇజం’ చూపించేందుకు రెడీ అయ్యాడట. ప్రస్తుతం రిమేక్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

ఇప్పటికే పూరి ‘పోకిరి’ని ‘వాటెండ్’ రిమేక్ చేసి హిట్ కొట్టాడు సల్మాన్. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన వాటెండ్ బాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ చేరింది. మరి.. పూరి ‘ఇజం’తో కూడా సల్మాన్ హిట్ కొడతాడేమో చూడాలి.