మహేష్ ను వెనక్కి నెట్టేసిన సమంత

0
118

Posted November 15, 2016

Samanta Push Back Mahesh On Twitter Followersసూపర్ స్టార్ మహేష్ ను వెనక్కి నెట్టేసింది సౌత్ సూపర్ బ్యూటీ సమంత. అదెలా సాధ్యం మహేష్ ఫాలోయింగ్ తో ఏమాత్రం సంబంధం లేని సమంత మహేష్ ను ఎలా వెనక్కి నెట్టేసింది అంటే.. సోషల్ మీడియాలో మహేష్ యాక్టివ్ గానే ఉంటాడు కాని అన్ని సమయాల్లో కాదు.. కాని సమంత ఉదయం లేచి దగ్గర నుండి నైట్ వరకు మొత్తం సోషల్ నెట్వర్కింగ్ తో టచ్ లో ఉంటుంది. ఇదే తనను ఫాలో అయ్యే ఫ్యాన్స్ కు దగ్గర చేస్తుంది. ఈ క్రమంలో ట్విట్టర్ లో మహేష్ ను 2.5 మిలియన్ పీపుల్ ఫాలో అవుతుంటే. సమంతను 30 లాక్స్ పీపుల్ ఫాలో అవుతున్నారు.

సో ఈ లెక్కన నెటిజెన్లు మహేష్ కన్నా సమంతకే ఎక్కూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట. రోజుకో అప్డేట్ తో పాటుగా ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది సమంత. అందుకే తనకు ఈ రేంజ్ ఫాలోయింగ్. అయితే మహేష్ తో పోల్చుకుంటే అసలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో సమంత ఎంతో దూరంలో ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఉన్న మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా అవతరించాడు.

ప్రస్తుతం మురుగదాస్ మూవీ చేస్తున్న మహేష్ ఆ తర్వాత కొరటాల శివతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక సమంత మాత్రం తమిళ సినిమా ఒకటి ఒప్పుకుంది.