సమంత విశాల్ తో మొదలెట్టింది..

 Posted October 24, 2016

samantha acting with vishal movieటాలీవుడ్, కోలీవుడ్ లోనూ సమంత స్టార్ హీరోయిన్.ఆమె సినిమా ఒప్పుకుంటే కోట్లు కుమ్మరించేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే, ‘జనతా గ్యారేజ్’ తర్వాత సమంత మరో సినిమా ఒప్పుకోవడం లేదని.. నాగచైతన్యతో పెళ్లికి రెడీ అయ్యిందని.. సమంత ఆఖరి చిత్రం ‘జనతా గ్యారేజ్’.. ఆమె ఫస్ట్ ఇన్నింగ్స్ కి ఇక, తెరపడినట్టేననే ప్రచారం జోరుగా సాగింది. ఇందుకోసమే తమిళ్ స్టార్ ధనుష్ చిత్రాన్ని కూడా వదులుకొందని చెప్పుకొచ్చారు.

అయితే, అందరికీ షాక్ ఇస్తూ..సమంత విశాల్, శివకార్తికేయన్ సినిమాలని ఒప్పేసుకొంది.తాజాగా, మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విశాల్ ‘ఇరుంబుత్తిరై’ చిత్రం షూటింగ్ చెన్నై లో జరుగుతోంది.ఈ షూటింగ్ లో సమంత కూడా జాయింది.దీంతో.సమంత ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసినట్టేననే ప్రచారానికి తెరపడినట్టయింది

ఇదిలావుండగా.. నాగచైతన్య-సమంతల వివాహం వచ్చే యేడాది జరగనుంది. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటించనుంది. ఇదే విషయాన్ని చైతూ కూడా పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి.. సమంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడబోతుందన్న మాట.