సమంతది 1.5 కోట్ల ఖరీదైన లవ్‌.. చైతూ అదృష్టవంతుడు

0
98

 Posted May 4, 2017 at 17:51

samantha BMW car gift to naga chaitanyaఅక్కినేని హీరో నాగచైతన్య, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతలు త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం అయ్యింది. అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరు కొన్ని నెలలుగా సహజీవనం సాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎప్పటికప్పుడు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ, ఇద్దరి మద్య పెంచుకుంటూ ఉన్నారు. వీరిద్దరి ప్రేమను చూసి టాలీవుడ్‌ వర్గాల వారు కూడా కుల్లుకుంటున్నారు. తాజాగా చైతూకు సమంత ఇచ్చిన గిఫ్ట్‌ మరింతగా చర్చనీయాంశం అయ్యింది.

సెలబ్రెటీ స్టేటస్‌ సింబల్‌ అయిన బిఎండెబ్ల్యూ కారును నాగచైతన్య కోసం సమంత కొనడం జరిగింది. ఏకంగా కోటిన్నర రూపాయలు పెట్టి సమంత ఈ ఖరీదైన గిఫ్ట్‌ను చైతూకు ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. చైతూ కూడా ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. గతంలో స్పోడ్స్‌ బైక్‌లు అంటే ఇష్టం ఉన్న చైతూకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఒక స్పోడ్స్‌ బైక్‌ను సమంత కొనిచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ చాలా ఖరీదైందని ఈ బహుమతులు చూస్తుంటేనే అనిపిస్తుంది. వీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఇలాగే ఉండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.