సమంత ఫిట్నెస్ సీక్రెట్ అదేనా..!

Posted November 10, 2016

smas11హీరోయిన్ ఫిట్నెస్ విషయంలో ఎవరికి వారు తగ్గ ప్రణాళికల్లో ఉంటారు. తమ లుక్ విషయంలో జాగ్రత్త పడే హీరోయిన్స్ ఎప్పుడు ఫిట్ గా ఉండాలని చూస్తుంటారు. ఆ క్రమంలో జిమ్ లు గట్రా కంపల్సరీ అయ్యాయనుకోండి. రీసెంట్ గా 75 కిలోల బరువుని అవలీలగా ఎత్తి ఓ అథ్లెట్ రూపంలో కనిపించిన సమంత తన ఫిట్ నెస్ కారణంగానే అలా పర్ఫెక్ట్ గా ఉన్నానంటుంది. నాజూకుగా కనిపిస్తూనే తన స్టామినా ఇది అని చాటి చెప్పిన సమంత ఏరోజు జిమ్ మిస్ అవ్వదట.

ఒకవేళ టైట్ షెడ్యూల్ వల్ల జిమ్ టైం మిస్ అయినా సరే జాగింగ్ మాత్రం కచ్చితంగా చేస్తుందట. ప్రస్తుతం చైతుతో పెళ్ళికి సిద్ధమైన సమంత తన ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు అవి తినకూడదు ఇవి తినకూడదు లాంటి కండీషన్స్ ఏమి లేకుండా ఏది పడితే అవి తినేసి దానికి తగ్గ వ్యాయామం చేస్తా అంటుంది ఈ అమ్మడు. తెర మీద అందంగా కనిపించే ముద్దుగుమ్మలు ఇలా జిమ్ లో కష్ట పడటం వారికి ఇష్టమైన అభిమానులకు మాత్రం కష్టంగానే అనిపిస్తుంది.