బికినీలో కాబోయే పెళ్లికూతురు!!

Posted December 27, 2016

samantha in bikniమరి కొన్ని రోజుల్లో ఎంగేజ్ మెంట్ అని వార్తలొచ్చేస్తున్నాయి. ఈ టైంలో ఏ పెళ్లి కూతురైనా ఎక్కడ ఉంటుంది. షాపింగ్ లోనో… ఎంగేజ్ మెంట్ పనుల బిజీలోనో ఉంటుంది. కానీ ఈ కాబోయే పెళ్లి కూతురు మాత్రం బికినీలో రచ్చ రచ్చ చేస్తోంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ ను మాయ చేసిన సమంత.

జనవరి 29న చైతూ-సమ్మూ ఎంగేజ్ మెంట్ అనే మాట మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారికంగా ఇరుకుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ అదే డేట్ దాదాపు ఖాయమనేనని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో సమ్మూ ఎంచక్కా కాబోయే శ్రీవారితో హాలిడేస్ ను ఎంజాయ్ చేసింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా… లవ్ బర్డ్స్ ఇద్దరూ సముద్రపు ఒడ్డున దుమ్మురేపేశారు. సమంత అయితే బికినీలో హాట్ హాట్ గా పోజులిచ్చేసింది. ఈ ఫోటోను తానే స్వయంగా పోస్ట్ చేసింది.

పనిలో పనిగా సముద్రం గురించి వర్ణిస్తూ అందమైన పదాలను వాడింది సమంత. బ్యూటిఫుల్, మిస్టీరియస్, వైల్డ్ అండ్ ఫ్రీ అంటూ వర్ణించేసింది. కానీ అభిమానులు మాత్రం సమ్మూ అందం ముందు సముద్రం కూడా దిగదుడుపే నంటున్నారు.