రాశి బదులు సమంతకు ఛాన్స్..!

0
131

Posted November 28, 2016

 Samantha Replaced Rashi Khanna Tollywood Movie

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్లో ఓ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు చరణ్. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా రాశి ఖన్నా ఫైనల్ అన్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం రాశి బదులు సమంత ఆ ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పటివరకు మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతోనే నటించిన సమంత ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే మొదటిసారి చరణ్ తో జతకడుతున్నట్టు.

సౌత్ లో సూపర్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన సమంత త్వరలో నాగ చైతన్యను పెళ్లి చేసుకోనుంది. ఇక పెళ్లి తర్వాత కూడా కెరియర్ కొనసాగిస్తా అని చెప్పిన శ్యాం చెర్రి సినిమా పెళ్లికి ముందే కానిచ్చేస్తుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే కోలీవుడ్ హీరో విశాల్ సినిమాకు సైన్ చేసిన సమంత అఆ తర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు. త్రివిక్రం పవన్ సినిమా చేసే ఆలోచన చేసినా ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గిందని టాక్.

ఇక ఓ పక్క రాశి ఖన్నా కూడా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంది ఈ సంవత్సరం ఇప్పటికే సుప్రీం హిట్ అందుకున్న ఈ భామ హైపర్ తో కూడా పర్వాలేదు అనిపించుకుంది. మరి రాశి కాదని సమంతకు షిఫ్ట్ అయిన చెర్రి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.