మహానటిలో సమంత ఉంది.. కానీ

Posted December 22, 2016

Samatha Is In Mahanati But Not For Lead Roleబయోపిక్ లు బాగా వస్తున్న ఈరోజుల్లో ప్రస్తుతం తెలుగు మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించే మహానటిలో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేశారో ఇంకా తేలలేదు. నిన్న మొన్నటిదాకా సమంత ఈ రోల్ చేస్తుంది అంటూ హడావిడి చేసినా మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. స్వతహాగా సమంత ఆ పాత్ర కోసం రిస్క్ చేసుకోలేనని తప్పుకుందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే మహానటిలో సమంత ఉందట కాని చేసేది సావిత్రి రోల్ కాదట.

మరి ఇదేం ట్విస్టో అర్ధం కావట్లేదు. ముందు నుండి అనుకుంటున్న నిత్య మీనన్ నే మహానటి లీడ్ రోల్ గా ఎంపిక చేశారట. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నాగ చైతన్య కూడా నటిస్తారని టాక్. అంతా ఓకే కాని సమంత లీడ్ రోల్ కాకుండా సపోర్టింగ్ రోల్ చేయడం ఏంటన్నది తెలియట్లేదు. ఈ విషయంపై క్లారిటీ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు.

ఓ పక్క నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమవుతున్న సమంత ఇలా సపోర్టింగ్ రోల్ చేస్తే హీరోయిన్ గా క్రేజ్ తగ్గినట్టే. మరి సమంతను ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కాని నిన్నటి దాకా మహానటిగా నటిస్తుంది చెప్పి ఇప్పుడు ఆ సినిమాలో ఓ ప్రత్యేక రోల్ అని ఆమె ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నారు మహానటి చిత్రయూనిట్.