మరింత కొత్తగా సామ్‌సంగ్‌ జే3

Posted November 20, 2016

samsung-galaxy-j3-2017-edition-ph-specs-price-release
స్మార్ట్‌ఫోన్‌ రంగంలోనే రారాజుగా వెలుగొందుతున్న సామ్‌సంగ్‌ నుంచి మరో కొత్త మొబైల్‌ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో విజయవంతమైన జే3 కొత్తవర్షన్‌ 2017 మోడల్‌ని తీసుకురాబోతుంది. ఇప్పుడున్న దానికి మరింత అడ్వాన్డ్స్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లను దృష్టిలో ఉంచుకుని స్పెసిఫికేషన్లు ఉండటంతోపాటు ధర కూడా తక్కువగా ఉండేలా ప్రణాళిక వేస్తున్నారు.. 2జీబీ ర్యామ్‌తో, దాదాపు రూ.7వేల ధరలో అందుబాటులోకి రానుంది. ద్విచక్రవాహనం నడిపుతూ ఉండేవారికి ఎంతో ఉపయోగకరమైన ‘ఎస్‌ బైక్‌ మోడ్‌’ని మరింత మెరుగ్గా దీంట్లో అందించనున్నారు. ఈ మోడ్‌ ఆన్‌ చేస్తే దాదాపు 14 భారతీయ భాషల్లో రిప్లై ఇచ్చేలా రూపొందించారు. దీని ద్వారా మొబైల్‌ యజమాని ట్రాఫిక్‌లో ఉన్న విషయం చెబుతూ యూజర్‌ సందేశం ఇస్తుంది.. ఒక వాళ్లు చెప్పింది రికార్డు చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 430 చిప్‌సెట్‌తో అక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉండబోతుంది. తక్కువ ధరలో మధ్యతరగతి వర్గాలని లక్ష్యం చేస్తూ మొబైల్‌ రాబోతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.