శాన్‌డిస్క్‌ నుంచి మొబైల్‌, కంప్యూటర్‌ పెన్‌డ్రైవ్‌

Posted November 11, 2016
sandisk 256gb micro sd card to mobile and computer pen driveఇప్పుడు పెన్‌డ్రైవ్‌ వాడకం విపరీతంగా పెరిగింది. ఆఫీసు సమాచారమే కాకుండా ఆంతరంగిక విషయాలుకూడా దాంట్లో స్టోర్‌ చేస్తున్నాం.. కాని వాటిని వాడుకోవాలంటే మాత్రం కచ్చితంగా కంప్యూటర్‌ కావాల్సిందే.. ఆ ఇబ్బందికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే యూఎస్‌బీ ఆన్‌ ద గో (ఓటీజీ) దాని ద్వారా ఇటు మొబైల్‌కి అటు కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు.. దానికి అనుగుణంగా ఒకవైపు యూఎస్‌బీ మేల్‌, మరో వైపు మైక్రోయూఎస్‌బీ మేల్‌ తో వీటిని సిద్ధం చేస్తారు.. ఇప్పుడు శాన్‌డిస్క సంస్థ నుంచి యూఎస్‌బీ ఓటీజీకి ఉపయోగపడేలా అల్ర్టా డ్యుయల్‌ డ్రైవ్‌ 3.0 పెన్‌డ్రైవ్‌ విడుదలైంది.  ప్రస్తుతం 16జీబీ రాబోయే పెన్‌డ్రైవ్‌ రూ.650 ఉంటుంది. అదే 128జీబీ అయితే రూ.3,600 ధర ఉంటుంది.. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు చేపడుతున్నారు. అయిదేళ్ల వారంటీ ఉండే వీటికి 150 ఎంబీ స్పీడుతో డాటాని ట్రాన్సఫర్‌ చేసుకోవచ్చు..
256జీబీ మైక్రోఎస్డీ కూడా..
 డ్యుయల్‌ యూఎస్‌బీతోపాటు శాన్‌డిస్క్‌ 256 జీబీ మైక్రోఎస్డీ కార్డ్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు 128 జీబీ వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉండేది.. ఇప్పుడు కొత్తగా విడుదల చేసినదానితో భారీ ఎస్డీకారుగా గుర్తింపు తెచ్చుకుంది..శాన్‌డిస్క్‌ అలా్ట్ర మైక్రోఎస్డీఎక్స్‌సీ పేరుతో విడుదల చేసింది. దీని ధర కూడా అంతే భారీగా ఉంది. రూ.13,390తో డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్నట్లు సంస్థ పేర్కొంది. కేవలం అమెజాన్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు చేపట్టనున్నారు. 24 గంటల పాటు ఫుల్‌హెచ్‌డీ వీడియోలు రికార్డు చేసినా ఎంచక్కా స్టోర్‌ చేసుకోవచ్చు.. లోమెమరీ మాటే ఉండదు.. డాటా కూడా 95 ఎంబీ స్పీడ్‌తో ట్రాన్సఫర్‌ చేసుకోవచ్చు.. పైగా ఇది వాటర్‌, ఫైర్‌, షాక్‌, ఎక్స్‌రే ఫ్రూఫ్‌గా అందిస్తున్నారు.