దానికో దండం అంటున్న శర్వానంద్‌!!

0
89

Posted May 13, 2017 at 13:09

sarvanand dont want to produce films
ఈ సంవత్సరం ఆరంభంలో సంక్రాంతికి శర్వానంద్‌ ‘శతమానంభవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్‌ తాజాగా ‘రాధ’ సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. ‘రాధ’తో కూడా శర్వా మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లుగా టాక్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సమయంలోనే శర్వానంద్‌ మీడియాతో మాట్లాడుతూ నిర్మాణం జోలికి మళ్లీ వెళ్లను అని, గతంలో ‘కో అంటే కోటి’ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నాను, మరో సారి అలాంటి బుద్ది తక్కువ పనులు చేయను అంటూ చెప్పుకొచ్చాడు.

‘కో అంటే కోటి’ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని శర్వానంద్‌ నిర్మించాడు. ఆ సినిమాలో శ్రీహరి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు. కథ మరియు కథనం రెండు కూడా చెత్తగా ఉన్నాయనే టాక్‌ రావడంతో పాటు, ఏమాత్రం ఆకట్టుకోని హీరో పాత్రతో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా తెచ్చిన లాస్‌ నుండి ఇప్పుడిప్పుడే శర్వానంద్‌ బయట పడుతున్నాడు. ఇలాంటి సమయంలో మరోసారి నిర్మాణం అంటే తన వల్ల కాదని అంటున్నాడు. తాజాగా ఒక దర్శకుడు స్క్రిప్ట్‌తో వెళ్లి మీరు నిర్మిస్తే బాగుంటుందని అన్నాడట, అప్పుడు నవ్వుకుంటూ శర్వానంద్‌ నిర్మాణానికో దండం అన్నాడట. దాంతో దర్శకుడు మరో నిర్మాతను చూసుకునే పనిలో పడ్డాడు. ఒక్క సినిమాతోనే మేలుకున్న శర్వానంద్‌ను తెలివైన వాడు అంటున్నారు సినీ వర్గాల వారు.