జయకి శశికళ అంతిమ సంస్కారాలు..

Posted December 6, 2016

sasikala-performs-jayalalithaa-last-rites-650_650x400_61481027733
రాజకీయ విప్లవ నాయకి …పేదోడికి అన్నం పెట్టే తల్లి …సామాన్యుడి కష్టం తీర్చిన అమ్మ …జయలలితమ్మ ఇక ఎవరికీ కనిపించని లోకాలకు వెళ్లిపోయారు.ప్రజల కన్నీరు,రోదనలు,ప్రముఖుల నివాళుల మధ్య చెన్నై మెరీనా బీచ్ లో జయ అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాల తో పూర్తి అయ్యాయి.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,నేతలు,నటులు,ప్రముఖులు,ప్రజలు కడసారి అమ్మని చూసి అంజలి ఘటించారు . తమిళనాడంతా చెన్నై వచ్చిందా అన్నట్టు అంతిమ యాత్ర కనిపించింది.
మెరీనా బీచ్ లో ఎంజీఆర్ సమాధి కి 20 అడుగుల దూరంలో జయ కి అంతిమ సంస్కారాలు చేశారు.జయ నెచ్చెలి శశికళ ఆ బాధ్యతలు నిర్వహించారు.చందనపు పేటికలో ఉంచిన జయ పార్థివ దేహానికి సాంప్రదాయ బద్దంగా నిర్వర్తించాల్సిన విధులన్నీ శశికళ చేతుల మీదుగానే జరిగాయి.సూర్యాస్తమయం తోనే ఓ విప్లవ నాయకురాలు అస్తమించారు.తమిళనాడు కి తీరని వేదన మిగిల్చి వెళ్లారు.