8 లేదా 9 న తమిళ్ సీఎం గా శశికళ?

Posted February 4, 2017

sasikala want to tamil nadu chief minister date confirmed
చిన్నమ్మ శశికళ తమిళ సీఎం గా పగ్గాలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఐటీ దాడులు, అవినీతి కేసుల నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఆమె వెనకడుగు వేస్తారని అంతా భావించినా అదేమీ లేదని తేలిపోయింది. శుక్రవారంనాడు పార్టీ లో శశి కీలక మార్పులు చేశారు. జయ కి సన్నిహితంగా మెసిలిన ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ రాజీనామా నిర్ణయం కూడా శశి ఆదేశాల మేరకే అని తెలుస్తోంది.పార్టీలో పట్టు తో ఆగిపోతే ప్రజాక్షేత్రంలో పాపులర్ కాలేమన్న సందేహంతోనే శశి సీఎం పగ్గాలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.ఈ నిర్ణయానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆమోదం కోసమే రేపు వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.ఈ భేటీకి తప్పక రావాలని ఇప్పటికే అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు సమాచారం పంపారు.

చెన్నైలో జరిగే ఎమ్మెల్యేల భేటీలో శశికళ సీఎం పగ్గాలు చేపట్టాలని ఓ తీర్మానం చేయడానికి రంగం సిద్ధమైంది.ఆ వెంటనే 8 లేదా 9 తేదీల్లో సీఎం పీఠం ఎక్కాలని శశికళ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కేపురం ఉప ఎన్నికల్లో సీఎం గానే పోటీ చేయకపోతే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయన్న భయం కూడా శశికళకి వుంది.జయ మేనకోడలు దీపా అక్కడినుంచే పోటీకి రెడీ కావడంతో శశికళ ఎంతోకొంత భయపడుతున్నారు.అటు సీఎం పన్నీర్ సెల్వం ప్రతిపక్ష నేత స్టాలిన్ తో కుమ్మక్కు కావొచ్చన్న భయం ఆమెకి ఎటూ ఉండనే వుంది. ఇలా అన్నివైపులా ప్రతికూల పరిణామాలు ఎదురుకాక ముందే సీఎం కుర్చీ ఎక్కాలని శశికళ డిసైడ్ అయిపోయారు.దానికి అనుగుణంగా ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు.అయితే అన్నీ ఆమె అనుకున్నట్టు జరుగుతాయో లేదో చూడాలి.
ఈ వార్తలని బలపరిచేలా బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఓ ట్వీట్ వేశారు.సోమవారం శశికళ ముఖ్యమంత్రి అయితే గనుక పోకిరీల పని పడతారని ఆయన ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే శశికళ సీఎం కుర్చీ ఎక్కాలని ఆరాటపడుతున్నది నిజమే అనిపించదా?