శశికళ సీఎం పీఠమెక్కే ముహూర్తమిదేనా?

Posted January 5, 2017

sasikala will be take tamil nadu chief minister chair on january 12
ముందుగా అన్నాడీఎంకే పగ్గాలు …ఆపై తమిళ సీఎం గా బాధ్యతలు…ప్రస్తుతానికి చిన్నమ్మ శశికళ అనుకున్నట్టే అంతా జరిగిపోతోంది. శేఖర్ రెడ్డి,రామ్మోహన్ ఆస్తుల మీద ఐటీ దాడులతో శశికళ వెనక్కి తగ్గుతారని కేంద్రంలోని పెద్దలు భావించారు.కానీ శశి ముందుకే అడుగేశారు.దాంతో ఆమెని అడ్డుకోడానికి పన్నీర్ ని అడ్డం పెట్టుకుని ఓ ఆటాడదామని కమలనాధులు భావించినా సీఎం దగ్గరనుంచి అంతోటి చొరవ కనపడలేదు.ఒకవేళ వ్యూహం బెడిసికొట్టి ఎన్నికల దాకా వెళ్లాల్సి వస్తే శశికళకి లేనిపోని ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని గ్రహించిన కేంద్రం ప్రస్తుతానికి సైలెంట్ అయ్యింది.అయితే అది వ్యూహాత్మకమే.ఈ పరిణామాలన్నీ గ్రహించి కూడా శశికళ వెనుకడుగు వేయకపోడానికి ప్రధాన కారణం పార్టీ మీద ఆమెకున్న పట్టే…అది గ్రహించే పన్నీర్ కూడా తెల్ల జెండా ఎత్తేశారు.

అటు డీఎంకే సైతం శశి వ్యతిరేకుల్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నా ప్రస్తుతానికి ఎవరూ దూకుడుగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.ఇలా రూట్ అంతా క్లియర్ అన్న సంకేతాలు అందుకున్న శశికళ తన ఆస్థాన జ్యోతిష్కుడి తో సీఎం పీఠమెక్కేందుకు ముహూర్తం పెట్టించారట. జనవరి 12 ముహూర్తం ఆమె పేరు మీద దివ్యంగా ఉంటుందని అయన ఇచ్చిన సలహా పాటించేందుకు శశి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే పోయెస్ గార్డెన్ పరిసరాల్లో పెరిగిన భద్రత చూసి ఆ ముహూర్తం నిజమేనని అన్నాడీఎంకే వర్గాలు కూడా భావిస్తున్నాయి.