ప్రేమకధగా రానున్న శాతకర్ణి సీక్వెల్..

Posted January 24, 2017

satakarni sequel as love storyబాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే శాతకర్ణికి సీక్వెల్ ను కూడా రూపొందిస్తామని చిత్ర దర్శకుడు క్రిష్ ప్రకటించాడు. శాతకర్ణి తనయుడు వశిష్టిపుత్ర పులోమావి రాజ్యపాలన నేపథ్యంలో ఈ సీక్వెల్ తెరకెక్కుతుందని..త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడిస్తామని తెలిపాడు.

కాగా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా భారీ విజయాన్ని అందుకోడంతో సీక్వెల్ చేయడానికి క్రిష్ అన్ని ఏర్పాట్లను చేసుకుంటన్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. వరుస యుద్ధాలు, సువిశాల సామ్రాజ్య విస్తరణ దిశగా శాతకర్ణి సినిమా నడవగా, సీక్వెల్ మాత్రం ప్రేమకథగా తెరకెక్కనుందని తాజా సమాచారం. పులోమావి, శ్రావణి మధ్య జరిగిన ప్రేమకథను .. ‘శ్రావణి’ అనే పేరుతో డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ ఓ నవలను రచించారని, ఆ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు చెబుతున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు, బాలయ్యే ఈ సినిమాను తన హోమ్ బ్యానర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.