విజయ్ యు వీ బ్యానర్ స్క్రిప్ట్ రెడీ

Posted November 20, 2016

 

vijay-devarakonda

 

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అప్పటికే అతను చేస్తున్న రెండు సినిమాలకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేశాడు. కొత్తగా రెండు మూడు పెద్ద బేనర్లలో సినిమాలు చేసే అవకాశం లభించింది. వీటిలో విజయ్ ముందు చేయబోయే పెద్ద సినిమా యువి క్రియేషన్స్ బేనర్లోనే. ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ అయింది.

ఒక కొత్త దర్శకుడితో ఈ సినిమా ఫైనలైజ్ అయింది. ఇది హార్రర్ కామెడీ మూవీ అని సమాచారం. యువి క్రియేషన్స్ బేనర్ స్థాయికి తగ్గట్లే కొంచెం భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని చేయబోతున్నారట. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో సైతం హార్రర్ కామెడీ వైపు చూస్తుండటం విశేషమే. ఈ నేపథ్యంలోనే యువి క్రియేషన్స్ వాళ్లు కూడా విజయ్ తో హార్రర్ కామెడీ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇక విజయ్ కొత్త సినిమా ‘ద్వారక’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ‘అర్జున్ రెడ్డి’ షూటింగ్ చివరి దశలో ఉంది.