2వ వారంలో కూడా దుమ్ము దుమ్మే

0
80

 Posted May 7, 2017 at 18:17

second week bahubali collections
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారం వరకు ఈ సినిమా సందడి ఉంటుందని అంతా భావించారు. కాని సినిమా కలెక్షన్స్‌ సునామి రెండవ వారం కూడా కొనసాగబోతుంది. నిన్న, నేడు భారీగా కలెక్షన్స్‌ వస్తున్నాయి. వారాంతం కావడంతో మొదటి వారం ఏ స్థాయిలో కలెక్షన్స్‌ను వసూళ్లు సాధించిందో అదే తరహాలోనే వసూళ్లు రాబడుతూ ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన బాహుబలి 2 రెండవ వారం కూడా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.

ఇండియన్‌ సినీ చరిత్రలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఈ స్థాయి కలెక్షన్స్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. ఇక రెండవ వారంలో కూడా భారీ వసూళ్లు వస్తుండం బాలీవుడ్‌ సినీ వర్గాల వారిని కూడా విస్తు పోయేలా చేస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం అందరికి తెలిసి పోయింది. దాంతో సినిమాకు రెండవ వారం నుండి పెద్దగా కలెక్షన్స్‌ ఉండవేమో అని సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు కూడా భావించారు. కాని అంచనాలను తలకిందులు చేసి మరిన్ని రికార్డులను నమోదు చేసేందుకు వీర వేగంతో దూసుకు పోతుంది.