సూర్యతో సినిమా దశాబ్ధం నాటి కల..!

Posted November 27, 2016

Image result for surya selva raghavan

సౌత్ సినిమాల్లో విలక్షణ నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్న సూర్య తెలుగు తమిళ భాషల్లో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే సూర్యతో సినిమా తీసేందుకు దర్శకుల లిస్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రస్తుతం ఎస్-3గా రాబోతున్న సూర్య ఆ తర్వాత సినిమా సెల్వ రాఘవన్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఓ పబ్లిక్ ఇంటర్వ్యూలో సెల్వ రాఘవన్ ఇదే విషయాన్ని ప్రస్థావించి సూర్యతో సినిమా దశాబ్ధ కాలం నాటి కలని.. ఎన్నోసార్లు సినిమా ప్రయత్నం చేసినా కుదరలేది.

ఇక సూర్యతో సినిమా అంటే దాదాపు బిగ్గెస్ట్ మూవీ అన్నట్టే. దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సెల్వరాఘవన్ సూర్యతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ప్రస్తుతం ఫాంలో లేని స్లెవ సూర్య సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక అన్ని కుదిరితే సూర్యనే స్వయంగా ఈ సినిమా నిర్మించాలని చూస్తున్నారు. మరి సూర్య, సెల్వల క్రేజీ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.