శశికళ జీవితంలో వైకుంఠపాళి..

Posted February 16, 2017

seshikala life gameజీవితం ఓ వైకుంఠపాళి..ఈ విషయం ఆధ్యాత్మిక రంగంలో కొద్దిపాటి పరిచయం వున్నవారు కూడా పదేపదే వినివుంటారు.కానీ జీవితాన్ని ఓ రేసులా చూసి గెలవడమే పరమావధిగా అడుగులేసే వాళ్లకి ఇదంతా చాదస్తంగా అనిపించవచ్చు.కానీ స్వానుభవంలోకి వస్తే ఎవరైనా ఈ విషయాన్ని నమ్మక తప్పదు.శశికళ అందుకు ఓ గొప్ప ఉదాహరణ.ఓ తప్పుకి ఆమె కోర్టులో కట్టాల్సిన జరిమానా 10 కోట్లు .జైలుకెళ్లినా సరే …ఆమె చెప్పినవాళ్ళే సీఎం.ఇక వందల కోట్ల ఆస్తులు వున్నాయి. నిన్నటిదాకా ఆమె చుట్టూ వందిమాగధులు.మాట చెప్తే శాసనం.గంటల్లో అన్ని మారలేదు గానీ కొన్ని ఊహించని విధంగా మారాయి.

మెత్తని పరుపులు,ఏసీ లేక పరప్పణ అగ్రహారం జైల్లో శశికళకి రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదంట. అందుకే తెల్లవారుజాము 4 గంటలకే ఆమె సగం నిద్ర తోనే రోజు మొదలుపెట్టారు.ఆరున్నరకు జైలు సిబ్బంది ఇచ్చిన టీ తాగారు.7 గంటలకి వాళ్ళ చేతుల మీదుగానే టిఫిన్ తిన్నారు.ఆ పై కొద్దిసేపు వార్తా పత్రికలు చదివారు.ఇక అప్పుడు అసలు పని మొదలైంది.50 రూపాయల రోజు వారీ కూలీకి ఆమె కొవ్వొత్తులు,అగరబత్తీలు తయారు చేయడం మొదలెట్టారు.జయ జైల్లో వున్నప్పుడు కూడా ఇదే పని చేశారు.ఇప్పుడు శశికి కూడా అదే పని.ఇక జైల్లో శశికళకి తోడు ఆమె మరదలు ఇళవరసి.ఒకప్పుడు జయకి తోడు శశికళ.ఇక జైలు సిబ్బంది ఆమెకి మూడు చీరలు,ఓ ప్లేట్,ఓ చెంబు,ఓ దుప్పటి ఇచ్చారు.వాటితోటే కొన్నేళ్ళపాటు శశి గడపాల్సి ఉంటుంది.కొన్ని గంటల్లో ఎంత మార్పు …శశి జీవితంలో ఇది నిజంగా వైకుంఠపాళి కాదంటారా?