గవర్నర్ ను తప్పుదోవ పట్టించిన చిన్నమ్మ?

Posted February 10, 2017

seshikala made governor into wrongroute
సీఎం సీటు కోసం శశికళ ఎంతకైనా తెగిస్తోందా? ఎమ్మెల్యేలతో డ్రామా నడిపిస్తోందా? ఆమె దగ్గర 130 మంది ఎమ్మెల్యేలు లేరా? గవర్నర్ విద్యాసాగర్ రావును కూడా చిన్నమ్మ తప్పుదోవ పట్టించిందా? అంటే ఔననే అంటోంది పన్నీర్ సెల్వం వర్గం.

సెల్వం వర్గం చెబుతున్న దాని ప్రకారం … శశికళకు ఎమ్మెల్యేలంతా మద్దతు పలకడం లేదు. అసలు ఆమె క్యాంపులో ఎమ్మెల్యేలు 130 మంది లేరట. 87 మందే ఉన్నారని టాక్. ఆ 87 మందిని మినహాయిస్తే.. మిగతా ఎమ్మెల్యేలంతా ఇప్పుడు బయటే ఉన్నారని సమాచారం. వారంతా పన్నీర్ సెల్వం వర్గం వారేనని టాక్. అసెంబ్లీలో సత్తా చాటుతానని సెల్వం అందుకే చెప్పారని తెలుస్తోంది. ఇక అన్నింటికి మించి గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితా కూడా ఫేక్ అన్న వాదన వినిపిస్తోంది.

శశికళ.. గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసినట్టు అనుమానాలున్నాయి. సీఎం పన్నీర్ సెల్వం కూడా ఇందులో వాస్తవముందని చెబుతున్నారు. గవర్నర్ కు ఇచ్చిన లిస్టులో 85 మంది ఎమ్మెల్యేల సంతకాలు మాత్రమే నిజమైనవని టాక్. మిగతా సంతకాలన్నీ ఫోర్జరీ చేశారన్న వాదన వినిపిస్తోంది. ఫోర్జరీ సంతకాలతో ఆమె గవర్నర్ ను కూడా తప్పుదోవ పట్టించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సంతకాల విషయంలో వస్తున్న విమర్శలను గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా చాలా సీరియస్ గా ఉన్నారట. ఇందులో నిజానిజాలు వెలికితీయాలని ఇప్పటికే అధికారులను ఆయన ఆదేశించారని సమాచారం. ఒకవేళ సంతకాలు ఫోర్జరీవి అయితే శశికళ కష్టాలు మరింత పెరిగే అవకాశముందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఫోర్జరీవి అయితే సీఎం సీటు మాట అటుంచి… చిన్నమ్మ డైరెక్ట్ గా జైలుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటోంది సెల్వం వర్గం.