పళనిస్వామిని ఎంపిక చేసిన శశికళ ..

Posted February 14, 2017

seshikala selected palanisamy as cm
శశికళ ఎవరూ ఊహించని విధంగా పావులు కదిపింది.పార్టీ సీనియర్ నేత సెంగోట్టైయన్,జయ మేనల్లుడు దీపక్ పేర్లని పక్కనబెట్టి పళనిస్వామిని ఎంపిక చేసుకుంది.తన దగ్గరున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకునేలా అనూహ్య నిర్ణయం తీసుకుంది. సుప్రీమ్ కోర్ట్ తీర్పు తర్వాత కూడా పార్టీ ఎమ్మెల్యేల మీద తన పట్టు కొనసాగించేలా శశికళ ఇలా మూవ్ అయింది.శశి అనూహ్య నిర్ణయాలతో పన్నీర్ సెల్వం కి కఠిన పరీక్ష ఎదురవుతోంది.ఎంత అనుకూల వాతావరణం వున్నా పన్నీర్ బలం పెరగకపోతే మాత్రం ఇంకో అవకాశం ఆయనకి వచ్చేట్టు లేదు. శశికి సీఎం ఛాన్స్ పోయింది కానీ అది పన్నీర్ సామర్ధ్యానికి సవాల్ గా నిలిచింది.