గాలి ఇంటికి షారుఖ్,కత్రినా ?

Posted September 28, 2016

 sharukh khan katrina attend gali janardhan daughter marriage
జైలు జీవితం తరువాత కొన్నాళ్ళు లో ప్రొఫైల్ లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కూతురి పెళ్లితో తన ఆడంబరాన్ని మళ్లీ ప్రదర్శించబోతున్నాడు.ఇప్పటికే బళ్లారి లో ఎంగేజిమెంట్ అయిన అయన కుమార్తె పెళ్లి నవంబర్ లో జరగనుంది.ఆ పెళ్ళిలో పెద్ద ఎత్తున సినీ తారలు సందడి చేసేలా గాలి ప్లాన్ చేస్తునట్టు తెలిసింది. దక్షిణాది తారలతో సరిపెట్టుకోకుండా బాలీవుడ్ దాకా వెళ్లాలని గాలి డిసైడ్ అయ్యారంట.ఇప్పటికే షారుఖ్,కత్రినా లు పెళ్ళిలోవినోదం పంచేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది.ప్రభుదేవా తో నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారట.అయితే ప్రభు దేవా దగ్గరనుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది.

భారతీయ మూలాలున్న ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు..లక్ష్మి మిట్టల్ లాంటి వాళ్ళు బాలీవుడ్ టాప్ స్టార్స్ తో ఇంటి పెళ్ళికి సందడి చేయించడం గతంలో చూసాం. ఇప్పుడు ఆ కోవలో చేరాలని గాలి కూడా ఉవ్విళ్లూరుతున్నారు.ఈ ఆడంబరమే గతంలో చేదు అనుభవాలకు కారణమైనా గాలి మైండ్ సెట్ మారలేదు. గాలి తన కుమార్తె పెళ్ళిలో ఇంకెన్ని గొప్పలు చూపిస్తాడో?