అటెండన్స్ ఉంటే రాహుల్ పాస్ అయిపోతాడా?

0
84

 Posted April 29, 2017 at 11:12

sheila dixit advice to rahul gandhi
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన రాజకీయాల్లోకి వచ్చాడో గానీ అపజయం ఆయన అడ్రస్ గా మారిపోయింది.దీంతో ఆయన నాయకత్వ ప్రతిభ మీద సందేహాలు ముసురుకుంటున్నాయి.కాంగ్రెస్ నే నమ్ముకున్న ఎంతోమంది రాహుల్ నాయకత్వం మీద ఆశలు వదులుకొని తమ దారి తాము చూసుకుంటున్నారు.ఇక ఏ దారి లేని ఇంకొందరు నేతలు మాత్రం రాహుల్ నాయకత్వాన్ని సాన పట్టడానికి తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.ఇప్పుడు అలాంటి ఓ సలహాతో ముందుకు వచ్చారు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్. కొత్తగా ఇచ్చినా ఆమె ఓ పాత ఐడియా ముందుకు తెచ్చారు.సెవెంత్,టెన్త్ మధ్య పబ్లిక్ పరీక్షలు వుండవు..జస్ట్ అటెండెన్స్ ఉంటే పాస్ అయిపోయినట్టే అంటారు కదా …అలాగే రాహుల్ కూడా రోజూ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కొన్ని గంటలు గడిపితే చాలట.పరిస్థితి నెమ్మదిగా అదే మారిపోతుందట.ఒకప్పుడు అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తల్లో సోనియా గాంధీ అదే పని చేసేవారట.దీంతో పార్టీ క్యాడర్ కి కొత్త ఉత్సాహం వచ్చి పార్టీ విజయానికి దోహదపడిందట.

ఏదేమైనా షీలా ఐడియా వింటే పాత చింతకాయ పచ్చడిలా అనిపించొచ్చు..అటెండెన్స్ ఉంటే పాస్ అయిపోవడానికి ఇదేమీ ఎయిత్,నైన్త్ క్లాస్ లు కాదు పాలిటిక్స్ .పైగా ప్రత్యర్థి మోడీ అనుకోవచ్చు. కానీ టెండూల్కర్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్ కూడా ఫామ్ కోల్పోతే చేసే మొదటి పని బేసిక్స్ కి కట్టుబడి బాటింగ్ చేయడమే.ఏమో షీలా చెప్పిన ఈ బేసిక్ ఆలోచన కాంగ్రెస్ గెలుపుకి దోహదం చేయకపోయినా పార్టీ క్యాడర్ తో రాహుల్ బంధం పటిష్టం చేయగలుగుతుంది. అయినా దిగ్విజయ్, ఆంటోనీ సహా ఇలా సీనియర్ నేతలు చాలా మంది రాహుల్ కి సలహాలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయారు. కానీ రాహుల్ పాటించింది లేదు …కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ మనసు మారి షీలా మాటలు పాటిస్తే మంచిది.కానీ …వృద్ధ నేతలకు దూరంగా కొత్త టీం తయారు చేసుకుంటున్న రాహుల్ కి ఈ మాటలు చెవికెక్కుతాయా ? ఏమో ..డౌటే .