సంపూ గురించి షాకింగ్‌ విషయం

0
77

Posted April 22, 2017 at 17:09

shocking news about sampoornesh babu
‘హృదయ కాలేయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన సంపూర్నేష్‌బాబుకు ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్‌ దక్కింది. సోషల్‌ మీడియాలో రాజమౌళి సంపూ గురించి చిన్న ట్వీట్‌ చేయడంతో అందరి దృష్టి సంపూపైకి మళ్లింది. ఆ సమయంలోనే తానో ఎన్నారైను అని, అమెరికాలో ఒక కార్పోరేట్‌ కంపెనీలో ఉద్యోగిని అంటూ చెప్పుకొచ్చాడు. పలు ఇంటర్వ్యూలు మరియు సోషల్‌ మీడియాలో కూడా తాను ఎన్నారైను అంటూ చెప్పుకొచ్చి అందరిని నమ్మించాడు. తాజాగా తాను అబద్దం చెప్పానంటూ బాబు పేల్చాడు.

సంపూర్నేష్‌బాబు ఒక యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన సందర్బంగా అసలు విషయం చెప్పుకొచ్చాడు. తన పేరు నుండి తన ఉద్యోగం వరకు అన్ని కూడా అబద్దమే అని స్వయంగా చెప్పుకొచ్చాడు. తానో ఎన్నారైను కాదని, సిద్దిపేటలో ఒక బంగారం షాపును నిర్వహించేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన పేరు సంపూర్నేష్‌బాబు కాదని, తన అసలు పేరు నరసింహా చారి అంటూ చెప్పుకొచ్చాడు. కంసలి పని చేసే తనకు మొదటి నుండి సినిమాలు అంటే ఆసక్తి అని, అందుకే సినిమాల్లో నటించాలనే ఊరు, పేరు, రూపం మార్చుకుని హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడ అనుకోని అవకాశంగా సినిమాల్లో ఛాన్స్‌ దక్కిందని చెప్పుకొచ్చాడు.