తెలంగాణ కార్డుదారులకు తీపి షాక్

0
47

Posted April 22, 2017 at 10:26

shocking news to pink card issuersఒకప్పుడు రేషన్ కార్డు ఉంటే పైసా ఆదాయం లేకపోయినా.. మారాజుల్లా బతికేవాళ్లు పల్లెటూళ్లలో. కానీ ఇప్పుడు తెల్లకార్డులున్నా కూడా సవాలక్ష నిబంధనలతో సంక్షేమానికే కొత్త అర్థం చెబుతున్నాయి నేటి ప్రభుత్వాలు. కార్డుపై ఐదు కిలోలు ఇచ్చే షుగర్.. ఇప్పుడు అరకిలోకి తగ్గించేశారు. ఇకపై ఆ అరకేజీకి కూడా దిక్కులేని పరిస్థితి వచ్చేసింది. మళ్లీ చెప్పేవరకు చక్కెర పంపిణీ చేయొద్ది ఉన్నతాధికారులు జిల్లా మేనేజర్లకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతానికి తాత్కాలికమే అని చెబుతున్నా.. ఇక శాశ్వతంగా షుగర్ పై ఆశలు వదులుకోవాలనే మాట వినిపిస్తోంది.

బహిరంగ మార్కెట్లో చక్కెర ధర 40 రూపాయల పైనే పలుకుతుంది. అదే రేషన్ షాపుల్లో కేజీ పదమూడు రూపాయల యాభై పైసలే. దీంతో రేషన్ షాపులో ఇచ్చే చక్కెరతోనే ఎలాగెలా సర్దుకుందామని చాలా మంది అడ్జస్టైపోతున్నారు. కానీ ఇప్పుడు అరకిలో కూడా ఇవ్వకపోతే ఇక ఎలాగని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. రేషన్ షాపులు పెట్టిందే.. ఆహార భద్రత కోసం. అలాంటిది బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటున్నప్పుడు చక్కెర కోటా ఎత్తేయడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడే లేడు.

సంక్షేమ రాజ్యం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు.. షుగర్ పై ఏం చెబుతారో. 2009 వరకు తెల్లకార్డుపై కిలో చక్కెర వరకు పంపిణీ చేసిన అధికారులు, 2010 నుంచి దానిని అరకిలోకి కుదించి వేశారు. ఇక గులాబీ కార్డుకు పూర్తిగా చక్కర కోటాను ఎత్తివేశారు. రేషన్‌ చక్కరకు డిమాండ్‌ ఉన్నా పంపిణీ చేయడం లేదు. ఒక్కసారిగా అరకిలో చక్కెర కూడా బంద్‌ కావడంతో కార్డుదారులు గొల్లుమంటున్నారు.