అలా చేసినందుకు ఇప్పుడు సిగ్గనిపిస్తుంది : శ్రియ

0
102

Posted April 23, 2017 at 16:27

shriya dislikes fairness cream adds
సినిమా స్టార్స్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రముఖ కంపెనీలు వారికి భారీ పారితోషికం ఇచ్చి మరీ వారితో తమ బ్రాండ్స్‌కు ప్రచారం చేయించుకుంటారు. ఆ ప్రచారంలో పచ్చి అబ్బద్దం ఉన్నా కూడా స్టార్స్‌ నవ్వుతూ ఆ బ్రాండ్‌కు పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. ఫేస్‌ క్రీమ్‌లు పెట్టుకుంటేనే పెళ్లి అవుతుందని యాడ్స్‌లో చూపిస్తూ ఉంటారు. అలాంటివి చూసి కొందరు నవ్వుకుంటారు, కొందరు మాత్రం నమ్ముతారు. అలా చేయడం తప్పని తెలిసినా తప్పలేద అంటూ తాజాగా శ్రియ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

శ్రియ ఆ ఇంటర్వ్యూలో.. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనలో నటించేందుకు తాను ఎంతో ఇబ్బంది పడ్డాను. క్రీమ్‌ రాసుకోకుంటే పెళ్లి కాదని చెప్పాలి అంటే ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు అలాంటి వాటిని చేయమంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు. గతంలో నేను చేసినందుకు ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు అలా ఎందుకు నటించానా అని సిగ్గు వేస్తుందని శ్రియ చెప్పుకొచ్చింది. డబ్బుల కోసం అప్పుడు నటించి ఇప్పుడు సిగ్గు అనిపిస్తుందని శ్రియ అంటుందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.