లవ్ ఎఫైర్ గురించి చెప్పిన శృతిహాసన్…

0
43

 Posted May 1, 2017 at 18:30

shruti hassan reveals about her love affairsశృతిహాసన్… ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్. కమల్ హసన్ కుమార్తె గా మూవీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ,తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయురాలు గా పేరు సంపాధించుకుంది శృతిహాసన్… మొదట్లో ఎక్స్ పోజింగ్ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించింది. అయితే ఈ పోటి ప్రపంచంలో ఎక్స్ పోజింగ్ చేయకపోతే నిలపడలేము అని గ్రహించి అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తర్వాత నుంచి తెర మీద ఎంతలా చెలరేగిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.

సినిమా సినిమాకు తన నటనతో, గ్లామర్ తో,అఫైర్స్ తో తరచూ వార్తల్లో నిలిచేది శృతిహాసన్. ఒకప్పుడు శృతిహాసన్ సిద్ధార్థ్.. ధనుష్.. రైనా.. రణబీర్ కపూర్… వీరితో రిలేషన్స్ లో ఉంది అంటూ వీళ్ళు త్వరలో ఒకటి అవ్వబోతున్నరంటూ గాసిప్స్ వచ్చేవి. కానీ శృతిహాసన్ వాటి మీద ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన లవ్ అఫైర్స్ గురించి వాటి బ్రేకఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఒకప్పుడు తను రిలేషన్ లో ఉన్నమాట నిజమేనని కానీ.. తనకు లవ్ కంటే పని మీదనే ఎప్పుడు దృష్టి పెట్టేదానినని.. అయితే.. అది అవతలివారికి నచ్చేది కాదని.. ఆ విషయంలో వాళ్ళు అభ్యంతరం పెట్టే వారని అందుకే తాను వారి నుంచి దూరం అయ్యేదానినని వెల్లడించింది. మనతో పాటు మన పనిని కూడా ఇష్టపడేవారినే భాగస్వామిగా ఎంచుకోవటం లైఫ్ లో చాలా కీలమని వ్యాఖ్యానించింది   శృతిహాసన్.. అయితే వాళ్ళ పేర్లు మాత్రం చెప్పలేదు.. ఇప్పుడు తాజాగా ఆమె ఓ ఫారినర్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.