మీసం తిప్పిన మీసం లేని సీఎం..

Posted February 2, 2017

siddaramaiah giving to land papers to tribal peoples
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య టైం ఎలా ఉందో..ఏమిటో గానీ ఇటీవల పాలనాపరంగా, పార్టీ పరంగా,వ్యక్తిగతంగా ఎన్నో ఒడిడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది.అనారోగ్యంతో కొడుకు మరణం, కాంగ్రెస్ లో అసమ్మతి,కావేరి జలాలు,శాంతిభధ్రతల వంటి అంశాల్లో సిద్ధరామయ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక బహిరంగ వేదికల మీద కూడా ఆయన చిత్రవిచిత్ర పరిణామాలు ఎదుర్కొన్నారు. కూతురు వయసున్న ఓ యువతి దగ్గరగా తాను ఓ తండ్రిలా భావించే సీఎం ని చూసి అభిమానంతో ముద్దు పెట్టుకుంటే దేశమంతా గోలైంది.ఇలా ఎన్ని ఇబ్బందులు,వివాదాలు ముందుకు వస్తున్నా ఈ రాజకీయ దురంధరుడు వెనకడుగు వేయడం లేదు.మరోసారి కర్ణాటకలో కాంగ్రెస్ ని అభివృద్ధి మంత్రం తోనే గెలిపిస్తానని చెప్తున్నారు.అనడమే కాదు మీసం తిప్పారు.

అసలు మీసమే లేని సీఎం సిద్ధరామయ్య ఎలా మీసం తిప్పారనేగా మీ డౌట్..నిజమే మీరన్నట్టు ఆయన తిప్పింది సొంత మీసం కాదు .ఓ గిరిజనుడి మీసం తిప్పి మీసం తిప్పే ముచ్చట తీర్చుకున్నారు సీఎం.ఆరు జిల్లాలకు చెందిన గిరిజనులకు అటవీభూమి హక్కు పత్రాలు ఇచ్చేందుకు ఓ కార్యక్రమం నిర్వహించారు.సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.ఆ టైం లో హక్కు పత్రాలు తీసుకోడానికి పెద్ద మీసాలతో వచ్చాడు ఓ గిరిజనుడు.అతనికి పత్రాలు ఇస్తూ మీసాలు కూడా మెలేసాడు సీఎం.భూమి హక్కు పొందిన గిరిజనులకు ఇక ఇబ్బందులు లేవని చెప్పేందుకు సిద్ధరామయ్య ఈ పని చేశారు.అంతరార్ధం ఏదైనా సభలో సీఎం తీరు నవ్వులు పూయించింది.