ఆ ముఖ్యమంత్రికి ట్వీట్ తెచ్చిన తంటా ..

Posted December 23, 2016

Siddaramaiah says Siachen is in China he will face repercussionsఒక్క అక్షరం పొల్లు పోయినా వీడు ఊరుకోడు రా అనే మాటల్ని మనం తరచు కొందరు గురించి వింటూ ఉంటాం అబ్బా ఆ మాత్రం అర్ధం చేసుకోలేవు అని ఈసడించుకోవడం చూస్తూనే ఉంటాం ఐతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కు కూడా ఇలాంటి అనుభవం అయ్యిందట అదికూడా ట్వీట్ లో అయ్యిందట ..అదేంటో చూద్దామా..కొన్ని పదాలు రాసేప్పుడు ఒక్క అక్షరం కూడా తప్పుగా రాయకూడదు. ఏమాత్రం పొరపాటు పడినా ఇబ్బంది పడాల్సి వస్తుంది…చైనాకి చెందిన ‘సియాచిన్‌’ ప్రావిన్స్‌ సీఎం లీ జంగ్‌ను కలిశానని.. ఈ సందర్భంగా బెంగళూరు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను తాము చర్చించామని సీఎం సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా కొంతమంది వ్యంగ్యంగా స్పందించారు. ఐతే నిజానికి సియాచిన్‌ హిమాలయాల్లో ఉన్న భారత సరిహద్దు ప్రాంతం. ‘సిచువాన్‌’ అనేది చైనాలోని ఓ రాష్ట్రం. స్పెల్లింగ్‌ పొరపాటుగా రాసి ట్వీట్‌ చేయడంతో అది కాస్త ఇలా మిస్ ఫైర్ అయింది..