వెండి పళ్లెం విందు..చౌహన్ కి చిక్కులు

 silver plate diner problems faced cm shivraj singh chouhanన్యాయ‌వాదులు టీ అడిగితే.. వెండి పల్లెంలో విందు ఇచ్చింది మ‌ధ్యప్రదేశ్ ప్ర‌భుత్వం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విష‌యాల‌ను సామాజిక కార్యకర్త అజయ్‌ దుబే రాబ‌ట్టడంతో విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో చిక్కుల్లో ప‌డ్డారు మ‌ధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ టీఎస్‌ ఠాకూర్‌తో సహా 240 మంది వీవీఐపీ న్యాయ‌వాదులకు ఏప్రిల్ 16న టీ పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీలో లాయ‌ర్స్ తో పాటు వారి వైఫ్ ల‌కు వెండి ప్లేట్ల‌లో విందు ఏర్పాటు చేసి, భారీగా బ‌హుమ‌తులు ఇచ్చింది మ‌ధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు ఖ‌ర్చ‌యింది ఏకంగా 3 ల‌క్ష‌ల 20 వేల రూపాయ‌ల‌ని స‌మాచారమిచ్చారు అధికారులు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమానికి  ప్రణ‌బ్ ముఖ‌ర్జీ కూడా హాజ‌ర‌య్యారు. చౌహాన్ చెబితేనే ఈ విందు ఏర్పాటు చేశామ‌న్నారు అధికారులు. టీ పార్టీకి ఇంత ఖర్చుపెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు.