“సరసుడు” గా అలరించనున్న శింబు

Posted February 2, 2017

simbu nayanthara acting together in sarasudu movieగతంలో మన్మధ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శింబు గుర్తున్నాడు కదూ. కొన్ని సంవత్సరాలుగా కోలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్స్‌ రావడం, వివాదంలో చిక్కుకోవడం వంటి వాటితో అతను తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. అయితే ఆ వివాదాల నుండి కాస్త తేరుకున్న శింబు త్వరలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.

తమిళ్ లో ఘన విజయం సాధించిన ఇదునమ్మఆలు  అనే సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు రానున్నాడు. సరసుడు  అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో శింబు సరసన  నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ నటించారు. ఈ నెల 14న ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ ను నిర్వహించి, సమ్మర్ లో  సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు శింబు. మరి ఈ ‘సరసుడు’… మన్మధ రేంజ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.